ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట పట్టణంలో గోదావరి నదివద్ద వచ్చే ఏడాది ప్రభుత్వం అధికారికంగా నిర్వహించనున్న పుష్కరాల ఏర్పాట్లను మంచిర్యాల డిసిపి భాస్కర్ సోమవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డిసిపి మాట్లాడుతూ పుష్కరాల ఏర్పాట్లను వేగవంతం చేయాలని వివిధ శాఖల అధికారులు పోలీస్ శాఖ అధికారుల సమన్వయంతో ఎలాంటిఅవాంఛనీయ సంఘటన జరగకుండా పుష్కర స్నానాలకు వచ్చే భక్తులకు మంచి ఏర్పాట్లు చేయాలని అంతే కాకుండా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సాధ్యమైనంత మేరకు పార్కింగ్ స్థలాన్ని గోదావరికి కాస్త దూరంలో ఉంచాలని అన్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఎలాంటి క్రైమ్ జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు. పుష్కరాల ఏర్పాట్లపై పోలీస్ అధికారులకు వాళ్లు సూచనలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసిపి ప్రకాష్ లక్షెట్టిపేట సిఐ రమణమూర్తి లక్షెట్టిపేట ఎస్సై గోపతి సురేష్ ఉన్నారు.
Admin
E Nivas News