Thursday, 30 July 2026 01:37:17 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

20న మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి...

కాటారంలో భారీ బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన ఐటీ మంత్రి...

Date : 18 April 2026 10:02 PM Views : 182

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ బ్యారేజీ పరిశీలన కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈనెల 20న భూపాలపల్లి జిల్లా మేడిగడ్డలో పర్యటిం చనున్నారు. ఈ నేపథ్యం లో కాటారం మండలం నస్తూరిపల్లిలో బహిరంగ సభనిర్వహించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, పర్యటనపై రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఐ డి ఓ సి కార్యాలయంలో సమీక్ష సమావేశంనిర్వహించారు. ఈ సమావేశంలో భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్ పి సిరీశెట్టి సంకీర్త్, భూపాల పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్య నారాయణ తో పాటు భూపాలపల్లి జిల్లా అన్ని శాఖలకు చెందిన అధికారులతో సమీక్ష నిర్వహించి నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో నిర్మించిన ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకమైన కాళే శ్వరం ప్రాజెక్టుపై ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. సరిగ్గా 2023 ఎన్నికల సమయం లో ప్రాజెక్టులోని కీలకమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగి పోవడంతో కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్ ప్రభు త్వం భారీ అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ఇప్పటికీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను బీఆర్ఎస్ ఖండిస్తోంది. అదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరిపి ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక అందించింది. అయితే ఈ కమిషన్ ఏర్పాటు అది సమర్పిం చిన నివేదికపై బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయగా.. దానికి సంబంధించిన తుది తీర్పు త్వరలోనే వెల్లడి కానుంది. ఈ నెల 20వ తేదీన సీఎం రేవంత్‌ రెడ్డి, కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజీ పరిస్థితిని స్వయంగా పరిశీలించనున్నారు. గతంలో కుంగిపోయిన ఈ మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన. పిల్లర్లను పరిశీలించి పునరుద్ధరణ పనుల పురోగతిపై ఇంజి నీరింగ్ అధికారులతో రేవం త్ రెడ్డి చర్చించనున్నారు. అదే సమయంలో కాళే శ్వరం పరిధిలోని గోదావరి నది వద్ద నిర్వహించినున్న సరస్వతి అంత్య పుష్క రాల ఏర్పాట్లపైనా సీఎం రేవంత్ రెడ్డి, సమీక్ష చేయ నున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేయనున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: