Thursday, 30 July 2026 09:34:42 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

మరిపెడ పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి

ఎమ్మెల్యే రామచంద్రునాయక్

Date : 08 February 2026 01:36 PM Views : 147

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్ర నాయక్ ఆధ్వర్యంలో విస్తృత ఎన్నికల ప్రచారం జరిగింది. మరిపెడ మున్సిపాలిటీ 5వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోడి రవి తరఫున ఆయన ప్రజలను కలుసుకుంటూ మద్దతు కోరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. జాటోత్ రామచంద్రు నాయక్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, నూతన రేషన్ కార్డుల పంపిణీ, సన్న బియ్యం పంపిణీ, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం వంటి పథకాలు ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం మరియు అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తోందని ఆయన పేర్కొన్నారు. మరిపెడ పట్టణ అభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరుతూ, మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. స్థానిక సమస్యలను పరిష్కరించడానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని, ప్రజలు పార్టీకి మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వంటికొమ్ము యుగంధర్ రెడ్డి, స్నేహా యూత్ అధ్యక్షులు మరియు కాంగ్రెస్ పార్టీ యువ జిల్లా నాయకులు నూకల అభినవ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెండ్లి రఘువీరారెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు షేక్ తాజుద్దీన్, మాజీ సర్పంచ్ పానుగోతు రాంలాల్, షేక్ అఫ్జల్, మాజీ ఎంపీటీసీ గంధసిరి అంబరీష, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ సర్వర్ భాయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిసి కాంగ్రెస్ అభ్యర్థి బోడి రవికి ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మరిపెడ పట్టణ ప్రజల నుండి కాంగ్రెస్ పార్టీకి మంచి స్పందన లభిస్తున్నట్లు నాయకులు తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: