ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆర్టీసీ కార్మికులు అధైర్యానికి లోను కావద్దని, ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటామని మాజీ మంత్రి హరీశ్‌రావు 'ఎక్స్'లో భరోసా ఇచ్చారు. కలిసికట్టుగా న్యాయబద్ధంగా పోరాడి హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. శంకర్‌గౌడ్ ఆత్మబలిదానం తమను తీవ్రంగా కలిచివేసిందని, ఆయన మృతికి సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వ అలసత్వం, నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. అధికారంలోకి రాగానే ఆర్టీసీ విలీన ప్రక్రియను పూర్తిచేస్తామని, ఇతర సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి మాట తప్పడం వల్లే ఈ దుస్థితి వచ్చిందని తెలిపారు.
Admin
E Nivas News