Friday, 31 July 2026 10:36:32 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

స్థానిక ఎమ్మెల్యే గండ్ల సత్యనారాయణ రావు

Date : 01 March 2026 08:53 AM Views : 115

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : జిల్లా కేంద్రంలోని భారత్ ఫంక్షన్ హాలులో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన సంత్ సేవాలాల్ మహరాజ్ 287వ జయంతి వేడుకల్లో స్థానిక ఎమ్మెల్యే గండ్ల సత్యనా రాయణరావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో పలు కీలక శాఖల్లో గిరిజన జాతి అధికారులు సేవలందించడం గర్వకారణమని పేర్కొన్నారు. జాతికి సేవ చేయడం ప్రతి ఒక్కరికి దక్కే అదృష్టమని అన్నారు. జిల్లా కేంద్రంలో సుమారు 2.కోట్ల వ్యయంతో సంత్ సే వాలాల్ మహరాజ్ బంజా రాభవనం మంజూరు చేసినట్లు తెలిపారు. అవసరమైతే అదనపు నిధులు మంజూరు చేసి నిర్మాణ పనులు పూ ర్తి చేయుటకు చర్యలు తీసు కుంటామని హామీ ఇచ్చారు. సంత్ సేవాలాల్ జయంతిని ప్రభుత్వపరంగా నిర్వహించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు గిరిజన సం క్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమం ఉద్దేశించి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ ఆ రోజుల్లోనే బంజా రా జాతికి విద్యా,విజ్ఞాన పరంగా దిశానిర్దేశం చేసిన మహనీయుడు సంత్ సేవాలాల్ మహరాజ్ అని కొని యాడారు. ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గిరిజన సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసు కొని సమగ్ర అభివృద్ధి సాధించాలని పిలుపు నిచ్చారు. స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఎఎస్పీ నరేష్ కుమార్, ఆర్డిఓ హరి కృష్ణ, మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, గిరిజన సంక్షేమ అధికారి నాగ సాగ ర్, ఉత్సవ కమిటీ అధ్యక్షులు సంతోష్ కుమార్, కమిటీ సభ్యులు దేవన్, కౌన్సిలర్లు, గిరిజన సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :