ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కామారెడ్డి జిల్లాలో అవినీతి అధికారి ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు.కామారెడ్డి జిల్లా బిచ్కుంద ఎక్సైజ్ కార్యాలయంలో సీఐగా విధులు నిర్వహిస్తున్న సత్యనారాయణ బాధితు డి నుంచి రూ.2 లక్షలు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యండెడ్‌గాపట్టుకున్నారు.ఒక గ్రామంలో ఉన్న కల్లు దుకాణం మరో గ్రామానికి తరలించేందుకు గాను ప్రతిఫలంగా ఎక్సైజ్ సీఐ సత్యనారాయణ లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో సీఐ ఇంటిపై దాడి చేసిపట్టుకున్నారు. అదేవిధంగా అతని వద్ద అదనంగా లభించిన రూ.45,670లను స్వాధీనం చేసుకున్నట్లు ఏసీబీ అధికారులు వివరించారు. సీఐపై కేసు నమోదు చేసి నాంపల్లి కోర్టులో హజరుపరిచినట్లు వెల్లడించారు.
Admin
E Nivas News