Friday, 31 July 2026 10:22:38 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే నాగరాజు...

Date : 07 April 2026 01:24 AM Views : 186

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ మార్క్‌ఫెడ్ సహకారంతో హన్మకొండ జిల్లా హసన్‌పర్తి మండల పరిధిలోని వంగపహాడ్, నాగారం గ్రామాలలో పాక్స్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సోమవారం వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కే.ఆర్. నాగరాజు, కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, పంటకు సరైన ధర లభించేలా ప్రభుత్వం ముందస్తుగానే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే నాగరాజు రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. రైతులకు న్యాయమైన ధరలు అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని చెప్పారు. రైతులు పండించిన మొక్కజొన్న పంటకు మద్దతు ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, మధ్యవర్తుల ద్వారా రైతులు నష్టపోకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకే పంటను తీసుకువచ్చి విక్రయించాలని సూచించారు. రైతుల సంక్షేమం ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశమని ఎమ్మెల్యే నాగరాజు పేర్కొన్నారు. రైతు సంతోషంగా ఉంటేనే దేశం అభివృద్ధి సాధిస్తుందని, అందుకే రైతులకు అన్ని విధాలుగా అండగా నిలవడం కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఆయన వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో రైతులకు మేలు చేసే విధంగా అనేక నిర్ణయాలు తీసుకుంటున్నామని ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు. రైతులు పండించిన పంటకు సరైన మద్దతు ధర అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా అధికారులకు సూచనలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు తాగునీరు, నీడ వంటి ప్రాథమిక సౌకర్యాలుకల్పించాలని అధికారులకు ఆదేశించారు. రైతులు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం వారి పక్షాన నిలబడి ప్రతి సమస్యను పరిష్కరిస్తుందని ఎమ్మెల్యే నాగరాజు తెలిపారు.అనంతరం గ్రామ జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో గత వారం రోజులుగా ఎన్ఎస్ఎస్ విద్యార్థుల శిక్షణ తరగతులు జరుగుతుండగా ముఖ్యఅతిథిగా పాఠశాలకు వెళ్లి వారితో సరదాగా గడిపి ఒక మొక్కను నాటి వారికి పలు సూచనలు సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మార్క్‌ఫెడ్ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, పాక్స్ ప్రతినిధులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: