ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం అంకుషాపూర్ గ్రామంలో గురువారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సమక్షంలో మాజీ ఎంపీటీసీలు ఠాక్రే కమలాబాయి, లక్ష్మణ్ నాయకులు సాంబయ్య, నారాయణ, రాజు, వసంతరావు, మురళి, సోనేరావు, పులి మేర వత్తు ధర్మయ్య తదితరులు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఎమ్మెల్సీ దృష్టికి అంకుషాపూర్ కి ప్రధాన సమస్యగా ఉన్న వాగుపై వంతెన నిర్మాణం పూర్తి చేయాలని అలాగే రాకపోకలకు తాత్కాలిక మార్గం ఏర్పాటు చేయాలని చెప్పగా ఆయన స్పందించి అధికారులతో మాట్లాడారు. అలాగే వంజరి గ్రామ పంచాయతీ పరిధిలోని సిఆర్ నగర్, ఎస్ కాలనీ లోని నీటి సమస్య ఉంది అని తెలుపగా సంబంధించిన అధికారిని పిలిపించి నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో నాయకులు తాజామాజీ ప్రజా ప్రతినిధులు తదితరులు ఉన్నారు.
Admin
E Nivas News