ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా, కెరమెరి మండలంలోని సావర్ ఖేడ గ్రామ శివారులో సోమవారం నిర్వహించిన వాహన తనిఖీల సందర్భంగా గంజాయి అక్రమ రవాణా కేసులో ఒక వ్యక్తిని పోలీసులు పట్టుకున్నట్లు కెరమెరి ఎస్‌ఐ మధుకర్ తెలిపారు. ఎస్‌ఐ తెలిపిన వివరాల ప్రకారం...సోమవారం సాయంత్రం స్థానిక పోలీస్ సిబ్బందితో కలిసి సావర్ ఖేడ గ్రామ శివారులో వాహన తనిఖీలు చేపట్టగా,అనుమానాస్పదంగా సంచరిస్తున్న సరోజిత్ మండల్ అనే వ్యక్తిని గుర్తించి విచారించారు. ఈ సందర్భంగా అతని వద్ద నుంచి 210 గ్రాముల గంజాయి లభ్యమైంది. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.5,250 ఉంటుందని ఎస్‌ఐ తెలిపారు. గంజాయిని స్వాధీనం చేసుకుని, నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. గంజాయి విక్రయం, కొనుగోలు లేదా వినియోగంలో పాల్గొన్న వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ. మధుకర్ హెచ్చరించారు.
Admin
E Nivas News