Friday, 31 July 2026 12:25:29 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

తెలంగాణలో ఒంటిపూట బడులపై ప్రభుత్వ ఆదేశాలు...

Date : 18 February 2026 01:58 PM Views : 303

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణలో పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా మార్చి 16 నుండి రాష్ట్రవ్యాప్తంగా ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త సమయ పట్టిక ప్రకారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు కొనసాగుతాయి. అనంతరం 12:30 గంటలకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేస్తారు. అయితే పదోవ తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. అలాంటి పాఠశాలల్లో మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించబడతాయి. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. వేసవి సెలవులు ఏప్రిల్ 24 నుండి ప్రారంభమవుతాయని విద్యాశాఖ స్పష్టం చేసింది. 2026-27 విద్యాసంవత్సరానికి సంబంధించి పాఠశాలలు జూన్ 12న తిరిగి ప్రారంభమవుతాయని పేర్కొంది. ఇక రంజాన్ సందర్భంగా కూడా పాఠశాల సమయాల్లో మార్పులు చేశారు. ముఖ్యంగా ప్రభుత్వ మరియు ఎయిడెడ్ ఉర్దూ మీడియం పాఠశాలల్లో ప్రత్యేక టైమ్‌టేబుల్ అమలు చేయాలని ఆదేశించారు. ఆ పాఠశాలల్లో ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు తరగతులు నిర్వహించాల్సి ఉంటుంది. అవసరమైతే వారానికి ఒక రోజు అదనంగా తరగతులు నిర్వహించవచ్చని కూడా విద్యాశాఖ సూచించింది. విద్యార్థుల ఆరోగ్యం, పరీక్షల నిర్వహణ, మతపరమైన సందర్భాలను సమన్వయం చేస్తూ ఈ మార్పులు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణలో పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా మార్చి 16 నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్లు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. కొత్త సమయ పట్టిక ప్రకారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు కొనసాగుతాయి. అనంతరం 12:30 గంటలకు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందజేస్తారు. అయితే పదో తరగతి పరీక్షా కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు. అలాంటి పాఠశాలల్లో మధ్యాహ్నం 1 గంట నుండి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహించబడతాయి. పరీక్షల నిర్వహణలో ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: