Thursday, 30 July 2026 07:02:33 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

ఎన్నికల సిబ్బంది రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి

జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కుమార్ దీపక్

Date : 06 February 2026 08:59 PM Views : 141

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో సిబ్బంది  రాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. శుక్రవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో మున్సిపల్ ఎన్నికల సాధారణ పరిశీలకుడు కె.గంగాధర్, జిల్లా విద్యాధికారి యాదయ్య లతో కలిసి 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికల సిబ్బంది రాండమైజేషన్ ప్రక్రియలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 2వ సాధారణ మున్సిపల్ ఎన్నికలలో భాగంగా ఒక బృందానికి 1 పి.ఓ., 1 ఎ.పి.ఓ., 3 ఓ.పి.ఓ. ల చొప్పున బెల్లంపల్లి మున్సిపాలిటీకి 68  బృందాలు, చెన్నూరు మున్సిపాలిటీకి 36  బృందాలు, క్యాతనపల్లి మున్సిపాలిటీకి 45  బృందాలు, లక్షెట్టిపేట మున్సిపాలిటీకి 30  బృందాలు, మంచిర్యాల నగరపాలక సంస్థకు 265 బృందాలు రాండమైజేషన్ ప్రక్రియ ద్వారా కేటాయించడం జరిగిందని తెలిపారు. ఎన్నికల సిబ్బంది వారికి కేటాయించిన స్థానాలలో ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించేలా సమన్వయంతో చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎన్నికల విధులు కేటాయించబడిన సర్వీస్ ఓటర్లు తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవడం కోసం బెల్లంపల్లిలో మున్సిపల్ కార్యాలయంలో, చెన్నూర్ లో మున్సిపల్ కార్యాలయంలో, లక్షెట్టిపేటలో మున్సిపల్ కార్యాలయంలో, క్యాతనపల్లిలో మున్సిపల్ కార్యాలయంలో, మంచిర్యాల నగరపాలక సంస్థకు సంబంధించి నస్పూర్ లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో ఫెసిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగిందని, 8, 9 తేదీలలో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని తెలిపారు. సర్వీస్ ఓటర్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తమ ఓటు హక్కు వినియోగం కోసం ఫారం 12, ఓటరు ఎపిక్ కార్డ్ తీసుకువెళ్లవలసి ఉంటుందని తెలిపారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముల్కల్లలో గల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రం, ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. బెల్లంపల్లి మున్సిపల్ పరిధిలోని బజార్ ఏరియాలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్నికల సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రం, ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, చెన్నూర్ మున్సిపల్ పరిధిలోని చెన్నూర్ పట్టణంలో గల అటవీశాఖ కార్యాలయం వెనుక ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రం, ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, క్యాతనపల్లి మున్సిపల్ పరిధిలోని సూపర్ బజార్ ఏరియాలో గల ఆర్.కె.సి.ఓ.ఎ. క్లబ్ లో సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రం, ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని, లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని పాత మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో సామాగ్రి పంపిణీ, స్వీకరణ కేంద్రం, ఓట్ల లెక్కింపు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్  పరిపాలన అధికారి పిన్న రాజేశ్వర్, ఎన్నికల సిబ్బంది, సంబంధిత అధికారులు తదితరులుపాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: