ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : జగిత్యాల జిల్లాలో బిఆర్ ఎస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిం చేందుకు ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి టి. జీవన్‌రెడ్డిఈనెల 20న బీఆర్‌ఎస్ అధినేత కేసీ ఆర్‌సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరనున్నారని మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్,ఎల్ రమణ వెల్లడించారు. ఈ నెల 20న సాయంత్రం 5 గంటలకు జగిత్యాలలో నిర్వహించే బహిరంగ సభకు మాజీ సీఎం కేసీఆర్, హాజరవుతుండగా నాయకులు భారీ ఏర్పాట్లు0 చేస్తున్నారు.గురువారం ఎర్రవల్లి లోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌తో జీవన్‌రెడ్డి, భేటీ అయిన సంగతి పాఠకులకు తెలిసిన విషయమే... జిల్లా కేంద్రంలోని ఎస్.కె.ఎన్ .ఆర్, డిగ్రీ కాలేజ్ గ్రౌండ్,మోతే రోడ్డు, ఇతర కాలేజీ ప్రాంగణాల ను నాయకులు పరిశీలిం చారు. బీఆర్‌ఎస్ ప్లీనరీ సభకు ముందే జగిత్యాల లో నిర్వహించే భారీ బహిరంగ సభలో భారీగా చేరికలు ఉంటాయని తెలిపారు. రాష్ట్రంలో రైతు సమస్యల తో ప్రజా సమస్యలపై బహి రంగ సభ నిర్వహించబోతు న్నామని వెల్లడించారు. కేసీఆర్ తో కలిసి పని చేయడానికి జీవన్ రెడ్డి ముందుకు రావడం సంతోషమని వివరించారు. కేసీఆర్ ప్రజాక్షేత్రంలోకి రాబోతున్నారని, ప్రజా సమస్యలపై ఇకపై నిరంతరం పోరాటం చేస్తామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు విద్యాసాగర్ రావు,కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, ఎమ్మెల్సీఎల్ రమణ,బాపు రెడ్డి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News