ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ నెల12న మంచిర్యాల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు మాజీ విప్, జిల్లా పార్టీ అధ్యక్షుడు బాల్క సుమన్ హైదరాబాద్ లో కేటీఆర్ ను కలిసి ఆహ్వానించారు. ఈ తరుణంలో కేటీఆర్ పర్యటన షెడ్యూల్p ఖరారు అయింది. ఆదివారం ఉదయం 11గం. లకు నస్పూర్ లోని జిల్లా పార్టీ కార్యాలయం తెలంగాణ భవన్ లో జరిగే కార్యకర్తల సమావేశం లో పాల్గొంటారు. ఈ సమావేశంలో భవిష్యత్ పై కార్యకర్తలకు దిశా నిర్దేశం చేయనున్నారు. అనంతరం అధికార కాంగ్రెస్ అరాచకాలను ఎదురొడ్డి గెలిచిన క్యాతనపల్లి మున్సిపాలిటీ నూతన పాలక మండలి సభ్యులను కేటీఆర్ సన్మానించనున్నారు. సమావేశం అనంతరం ఎంఎన్ఆర్ గార్డెన్ లో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కూతురి వివాహానికి హాజరై నూతన దంపతులను ఆశీర్వదిస్తారు. అక్కడి నుంచి క్యాతనపల్లి లో ని మాజీ విప్ బాల్క సుమన్ ఇంటికి కేటీఆర్ చేరుకుంటారు. వివిధ సంఘాల నేతల తో సమావేశమవుతారు. అనంతరం మీడియాతో మాట్లాడమన్నారు.
Admin
E Nivas News