Thursday, 30 July 2026 10:37:34 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నిబంధనలు పాటించాలి..

జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు

Date : 11 May 2026 12:50 AM Views : 98

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాలో వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో నిబంధనలు పాటించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు. ఆదివారం జిల్లాలోని లక్షెట్టిపేట మండలం ఇటిక్యాలలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మండల తహసిల్దార్ దిలీప్ కుమార్, మండల వ్యవసాయ అధికారి లతో కలిసి సందర్శించి ధాన్యం కొనుగోలులో నెలకొన్న సమస్యను పరిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి మద్దతు ధర చెల్లించి నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందని తెలిపారు. రైతుల వద్ద గల ధాన్యంను నిబంధనల ప్రకారం పరిశీలించి కొనుగోలు చేయాలని, కొనుగోలు అనంతరం గోదాములకు, రైస్ మిల్లులకు తరలింపు ప్రక్రియ సమర్థవంతంగా చేపట్టాలని తెలిపారు. మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో మండల తహసిల్దార్ దిలీప్ కుమార్, మండల వ్యవసాయ అధికారి లతో కలిసి మండలంలోని కొనుగోలు కేంద్రాల నిర్వహకులతో ధాన్యం లోడింగ్, అన్ లోడింగ్ అంశాలపై సమీక్షించారు. అకాల వర్షాల కారణంగా రైతుల వద్ద నుండి కొనుగోలు చేస్తున్న ధాన్యాన్ని తడవకుండా రైతుల సంక్షేమం లో భాగంగా గోదాములలో నిలువ చేయడం జరుగుతుందని, లారీలు, అందుబాటులో ఉన్న ట్రాక్టర్ల ద్వారా ధాన్యం తరలించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని, గోదాముల సామర్థ్యం, హమాలీల సంఖ్యను పూర్తిగా వినియోగిస్తూ నిల్వలను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ రైతుల వద్ద నుండి నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేయాలని తెలిపారు. కొనుగోలు ప్రక్రియలో రైస్ మిల్లులు, లారీలు, హమాలీలు, కొనుగోలు కేంద్రాలలో తలెత్తే సమస్యలను పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.అనంతరం జైపూర్ మండలం ఇందారం, రామారావుపేట లోని సుముఖ గోదామును కార్మిక శాఖ సహాయ కమీషనర్ తో కలిసి సందర్శించి మిల్లర్, గోదాము నిర్వాహకులతో మాట్లాడి ధాన్యం దిగుమతిపై పలు సూచనలు చేశారు. జిల్లాలో 12 రైస్ మిల్లులు పని చేస్తున్నాయని, కొనుగోలు కేంద్రాల నుండి కేటాయించిన ప్రకారం వచ్చిన లారీల నుండి ధాన్యం దిగుమతి చేసుకోవాలని తెలిపారు. ఈ నెల చివరి వరకు వీలైనంత ధాన్యం కొనుగోలు చేయాలని, 80 శాతం దాన్యం కొనుగోలు పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో మిల్లింగ్ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, రవాణా వాహనాలను మిల్లులకు తగిన విధంగా కేటాయించి, వరి ధాన్యం రవాణా, అన్‌లోడింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :