ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, హైద్రాబాద్, మంచిర్యాల జిల్లా లీగల్ సర్వీసెస్ ఆదేశానుసారం లక్షెట్టిపేట పట్టణంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో ఈనెల 15న నిర్వహించె స్పెషల్ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలని జూనియర్ సివిల్ జడ్జి కాసమల్ల సాయికిరణ్ శుక్రవారం ఒక ప్రకటనలు తెలిపారు. రాజీ పడదగ్గ అన్ని క్రిమినల్ కేసులు అలాగే అన్ని రకాల సివిల్ కేసులు, మనీ రికవరీ, యాక్సిడెంట్ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, మ్యారేజ్ కేసులు లోక్ అదాలత్‌లో రాజీ పడవచ్చు అని వారు పేర్కొన్నారు. మీరందరూ కూడా రాజీ పడాలని కక్షిదారులందరినీ కోరుతున్నట్లు చెప్పారు. అన్ని రకాల సివిల్ కేసుల్లో కూడా సంవత్సరాల తరబడి కోట్ల చుట్టూ తిరిగి మీ విలువైన సమయాన్ని డబ్బులు వృధా చేసుకోవద్దని, ఈ లోక్ అదాలత్లో ఇరుపక్షాలు కలిసి మాట్లాడుకుని సెటిల్ చేసుకుంటే, ఒక్కసారి రాజీ పడిపోయిన తర్వాత కేసు క్లోజ్ అవుతుందన్నారు. దీంతో మీకు డబ్బు, సమయం రెండు కూడా సేవ్ అవుతాయని, అదేవిధంగా మీరు సివిల్ కేసులో కట్టినటువంటి కోర్టు ఫీజు తిరిగి ఇవ్వబడుతుందని చెప్పారు. ఈ నెల 15న జరిగే లోక్ అదాలత్ సందర్బంగా ఈ నెల 3 నుంచి 15 వరకు రాజీపడే కేసులను జూనియర్ సివిల్ జడ్జ్ కోర్ట్ లక్షెట్టిపేట్ ఆవరణలో పరిష్కరిస్తారని తెలిపారు.
Admin
E Nivas News