Thursday, 30 July 2026 10:16:56 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

30 ఏండ్లు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నాను నాకు న్యాయ వ్యవస్థపై పూర్తి అవగాహన ఉంది. *వామన్ రావు హత్యకేసులో ఎవరు తమను ప్రోత్సహించలేదు

మంథనిలో విలేకరుల సమావేశంలో వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు

Date : 18 November 2025 06:00 PM Views : 264

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్ రావు-నాగమని దంపతుల హత్యకేసులో రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు తమను ప్రోత్సహిస్తున్నాడని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు ఆరోపించడం నిజం కాదని వామన్ రావు తండ్రి గట్టు కిషన్ రావు అన్నారు. మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఆయన మాట్లాడుతూ నేను గత 30 ఏండ్లుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నానని, నాకు న్యాయ వ్యవస్థ పై పూర్తి అవగాహన ఉందని, తన కొడుకు, కోడలును హత్య చేసిన నిందితులను న్యాయపరంగా శిక్షించాలని, వృద్ధ వయసులో తాను తన కుటుంబ సభ్యులతో కలిసి నిందితులకు శిక్ష పడాలని మొదటి నుంచి పోరాడుతున్నానని, న్యాయం వ్యవస్థ పై తమకు నమ్మకం ఉంది కాబట్టే హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్లి తమ లాయర్లు మేనక గురుస్వామి, భరత్ కుమార్, చంద్రకాంత్ రెడ్డిల సహకారంతో ఈ కేసును సుప్రీం కోర్టు లో వాదించడంతో సుప్రీం కోర్టు సిబిఐ కి అప్పగించిందని, ఈ కేసులో నాకు ఏం తెలవదని శ్రీధర్ బాబు అండదండలతో నేను సుప్రీంకోర్టుకు వెళ్లాలని పుట్ట మధు ఆరోపించడం శ్రీధర్ బాబు పై బురద చల్లడమేనన్నారు. ఈ కేసుతో పుట్ట మధుకు, ఆయన భార్యకు, సంబంధం లేదని ఆరోపిస్తున్నారని, పుట్ట మధుకు ఈ హత్యతో సంబంధం లేకుంటే తమ కుటుంబాన్ని ఒక్కసారైనా పుట్ట మధు వచ్చి పరామర్శించారా.. అని వామన్ రావు తమ్ముడు చంద్రశేఖర్ ప్రశ్నించారు. మాజీ స్పీకర్ శ్రీపాదరావు వద్ద పుట్ట మధు తన తండ్రి కలిసి ఉండేవారన్నారు. ఇకమీదట ఈ కేసులో సంబంధం లేని వారిని విమర్శిస్తే న్యాయపరంగా పోరాడుతామన్నారు. న్యాయ వ్యవస్థ పై తమ కుటుంబానికి నమ్మకం ఉందని తమకు జరిగిన అన్యాయం మరొకరికి జరగకుండా, తన కొడుకును, కోడలును పట్టపగలు నడిరోడ్డుపై దారుణంగా హత్య చేసిన నిందితులకు సుప్రీంకోర్టులో శిక్ష పడే వరకు ఇలాగే పోరాడుతామని వారు తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: