ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : గణిత శాస్త్రవేత్త రామానుజన్ జయంతి పురస్కరించుకుని మంథని కాకతీయ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో జాతీయ గణిత దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గణితానికి చేసిన సేవలను గురించి పాఠశాల ప్రిన్సిపల్, గణిత ఉపాధ్యాయుడు ప్రదీప్ రెడ్డి తెలియజేశారు. గణిత విశ్లేషణ, సంఖ్యా శాస్త్రము, అనంత శ్రేణులు, నిరంతర భిన్నాలు, త్రికోణమితి వంటి రంగాలలో శాస్త్రీయ శిక్షణ లేకపోయినా తనదైన శైలిలో గణిత సమస్యలకు పరిష్కారం కనుగొన్నారన్నారు. రామానుజన్ నెంబర్ 1729 అని దీనిని రెండు విభిన్న విధాలుగా, రెండు గణాల మొత్తముగా వ్యక్తపరచవచ్చన్నారు. ఆయన అతి చిన్న వయసులో చనిపోవడం భారతదేశానికి తీరని లోటు అన్నారు. ఆయన జన్మదినోత్సవాన్ని జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకోవడం గణిత ఉపాధ్యాయులందరికీ ఒక ప్రేరణ అన్నారు. అనంతరము ఆయన జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి గణిత ఉపాధ్యాయులకు పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పిల్లలందరూ గణితానికి సంబంధించి అనేక ప్రాజెక్టుల ప్రదర్శన, గణిత సాంస్కృతిక కార్యక్రమాలు పలువురుని అలరించారు. గణిత రంగోలి మ్యాథమెటిక్స్ క్విజ్ కాంపిటీషన్ నిర్వహించి బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమానికి గణిత ఉపాధ్యాయుడు దేవేందర్ ఆర్గనైజర్ గా వివరించారు. పాఠశాల డైరెక్టర్లు రవి కిరణ్ రెడ్డి, శ్రావణ్ రెడ్డి, స్రవంతి, పావని, పాఠశాల గణిత ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Admin
E Nivas News