Friday, 31 July 2026 04:35:35 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కార్డులను తక్షణం రద్దు చేయాలి

Date : 22 November 2025 09:38 PM Views : 216

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కార్డులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీరాంపూర్ కాలనీలో సింగరేణి కాలరీస్ కాంటాక్ట్ వర్కర్స్ యూనియన్ ( ఎస్ సి సి డబ్ల్యూ యు - ఐ ఎఫ్ టి యు ) ఆధ్వర్యంలో నాలుగు లేబర్ కోడ్ల ప్రతులను శనివారం నాయకులు దగ్ధం చేశారు. అనంతరం ( ఎస్ సి సి డబ్ల్యూ యు) సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డి. బ్రహ్మానందం మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం ఎన్నికల్లో ఉపాధి భద్రత, కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చి, నిన్న నాలుగు లేబర్ కోడ్ల అమలు చేయాలని అన్ని రాష్ట్రాలకు ఆర్డర్లు జారీ చేయడం జరిగిందన్నారు. కార్మికులు పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను రద్దుచేసి. పారిశ్రామిక సంబంధాల కోడ్, వేతనాల కోడ్, సామాజిక భద్రత కోడ్, వృత్తిపరమైన భద్రత ఆరోగ్యం పని పరిస్థితుల కోడ్. తీసుకురావడం జరిగిందని, ఈ కోడ్ వల్ల అన్ని రకాల కార్మికులు హక్కులు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలన్నీ ప్రైవేటికరించి అందుట్లో పని చేసే కార్మికులకు ఎలాంటి హక్కులు లేకుండా చేయడం కొరకు, కార్పొరేట్ కంపెనీలకు ఊడిగం చేయడం కొరకు నరేంద్ర మోడీ ఈ నాలుగు లేబర్ కోడ్లను అన్ని రాష్ట్రాలలో అమలు చేయాలని ఒత్తిడి తీసుకొస్తున్నా రన్నారు. ఎనిమిది గంటల పని విధానం స్థానంలో 12 గంటలు పని విధానం తేవడం, అతి తక్కువ వేతనాలతో ప్రైవేట్ కంపెనీలు పని చేయించుకోవడం కొరకు కార్పొరేట్ శక్తులకు ఈ నాలుగు లేబర్ కోడ్లు ఉపయోగపడతాయన్నారు. సరైన వేతనాలు లేక నాణ్యమైన భోజనం లేక, పరిశ్రమల్లో పనిచేయడం వల్ల కార్మికులు అనారోగ్యానికి గురయ్యే పరిస్థితి ఉందన్నారు. అన్ని రకాల కార్మికులు నరేంద్ర మోడీ తీసుకు వచ్చిన 4 లేబర్ కోడ్లు వల్ల ఎంత ప్రమాదం ఉందో అర్థం చేసుకొని ప్రమాదకరమైన 4 లేబర్ కోడ్ల ను రద్దు చేసేవరకు ఉద్యమించాలని కార్మిక వర్గానికి పిలుపునిస్తున్నా మన్నారు. కార్మికులు నాలుగు లేబర్ కోడ్ల కోసం జరిగే ఉద్యమాలలో పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతిరెడ్డి, బండారి రాజు, అప్పారావు, సుధాకర్, శంకర్ రాము, రాంబాబు, సమ్మయ్య, సుప్రియ, సత్య, శారద, కవిత, మల్లేశ్వరి, లక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :