ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట లో శ్రీరామ నవమి వేడుకలు శుక్రవారం జరగనున్న నేపథ్యంలో గురువారం హనుమత్ సంకల్ప మహా శోభయాత్ర, అన్న ప్రసాద వితరణను ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు సతీమణి, మాజీ డీసీసీ అధ్యక్షురాలు సురేఖ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజలి నర్సయ్య, వైస్ చైర్ పర్సన్ మోత్కూరి రాజేశ్వరివెంకటస్వామి గౌడ్ ల నేతృత్వంలో పాత బస్టాండ్ నుంచి కరీంనగర్ చౌరస్తాలోని ఎస్ పీ ఆర్ గార్డెన్ వరకు హనుమాన్ మాల ధారణ స్వాములు శోభ యాత్ర నిర్వహించడంతో లక్షెట్టిపేట పట్టణమంతా ఆంజనేయ స్వామి శరణు ఘోషతో మార్మ్రోగింది. గాంధీ చౌకులో మున్సిపల్ చైర్ పర్సన్ దొంత అంజలి నర్సయ్య హనుమాన్ శోభయాత్రను టెంకాయ కొట్టి ప్రారంభించారు. అనంతరం స్వాములు డీజే పాటలతో, నృత్యాలతో హోరేత్తించారు. బైక్ ర్యాలీ ద్వారా ఎస్పీ ఆర్ ఫంక్షన్ హల్ కు చేరుకుని హనుమాన్ చాలీసా పారాయణం, పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మాజీ డీసీసీ అధ్యక్షురాలు స్వయంగా హనుమాన్ స్వాములకు అన్న ప్రసాద వితరణ చేశారు.ఎంతో నియమ నిష్టలతో హనుమాన్ స్వాములు తమ భక్తిని చాటుకుంటున్నారని కొనియాడారు. ఈ మంచి కార్యక్రమంలో భాగస్వాములం అయినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతున్ని కోరుకుంటున్నట్లు తెలిపారు.కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటుందని వెల్లడించారు.
ప్రతి ఒక్కరూ ధర్మ మార్గంలో నడవాలని, హనుమాన్ కృప అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఆరీఫ్, మండల అధ్యక్షుడు పింగళి రమేష్, ఆర్ టీ ఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, కౌన్సిలర్లు బిరుదుల సత్యనారాయణ, చిన్నయ్య, చంద్రమౌళి, పెండెం పద్మ రాజు, నాయకులు, కార్యకర్తలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Admin
E Nivas News