ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మహిళా రిజర్వేషన్ బిల్లు కు ప్రతి ఒక్కరూ మద్దతు ఇస్తారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు . లోకసభ సీట్ల పెంపు విషయంలో భిన్న భిన్నాభిప్రాయాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ ఆయన సోషల్ మీడియా వేదికగా ( ఎక్స్) సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. మహిళా రిజర్వేషన్లకు అందరూ మద్దతు ఇస్తా రని, కానీ దాని ముసుగు లో లోక్‌సభ సీట్ల సంఖ్యను పెంచడం సరికాదని ఆయన స్పష్టం చేశారు. కేవలం జనాభా ప్రాతిపది కన లోక్‌సభ సీట్లు పెంచా లని చూడటం దక్షిణాది రాష్ట్రాలకు మరియు చిన్న రాష్ట్రాలకు తీరని అన్యాయం చేస్తుందని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఇది భవి ష్యత్తు లో దేశ సమాఖ్య స్ఫూర్తిని బలహీనపరుస్తుందని హెచ్చరించారు. మహిళా రిజర్వేషన్లు, లోక్‌సభ సీట్ల పెంపు అనేవి పూర్తిగా భిన్నమైన అంశాలని దేశ ప్రజలందరికీ తెలుసని పేర్కొన్నారు. అసెంబ్లీ స్థానాల్లో మహిళలకు రిజర్వేషన్లు అమలు చేస్తే దేశం మొత్తం హర్షిస్తుందని ఆయన సూచించారు. దేశ ప్రయోజనాలకు సంబంధించిన ఇంతటి కీలకమైన అంశంపై కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోకుండా, తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించాలని డిమాండ్ చేశారు.
Admin
E Nivas News