ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా లోని నిర్మల్ జిల్లా మామడ పోలీస్ స్టేషన్ పై గురువారం ఏసీబీ అధికారులు విశ్వసనీయ సమాచారంమేరకు దాడి చేయగా ఎస్సై అశోక్ లంచం తీసుకుంటూ పట్టుబడ్డారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రియల్ ఎస్టేట్ సంస్థకు సంబంధించి 40 వేల రూపాయల లంచం డిమాండ్ చేయగా బాధితుని నుండి ఈరోజు 20 వేల రూపాయలు లంచం తీసుకుంటుండగా వాళ్ల పని పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎస్సై వేధింపులు భరించలేక 40 వేల రూపాయలు ఇస్తానని ఒప్పందం చేసుకొని ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వారి సూచన మేరకు గురువారం ఎస్సైకి ముందుగా 20000 ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఎస్సై పై కేసు నమోదు చేసి కరీంనగర్ కోర్టుకు తరలించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు లంచం డిమాండ్ చేసినట్లయితే ఆదిలాబాద్ జిల్లా ఎసిబి డీఎస్పీని నేరుగా సంప్రదించాలని సూచించారు.
Admin
E Nivas News