ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : రానున్న మున్సిపల్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని బిజెపి పట్టణ శాఖ అధ్యక్షుడు సబ్బని సంతోష్ ఆధ్వర్యంలో శుక్రవారం మంథని బిజెపి పట్టణ కార్యాలయంలో పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తల సమక్షంలో మంథని మున్సిపల్ ఎలక్షన్ సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కొండపాక సత్య ప్రకాష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు బోగోజు శ్రీనివాస్, మంథని నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ వొజ్జల మురళీకృష్ణ, సీనియర్ నాయకులు బోయిని నారాయణ, నారమల్ల కృష్ణ, నాగారం వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు బూడిద తిరుపతి, పట్టణ ఉపాధ్యక్షుడు ఆకుల అరుణ్, దాసరి శ్రావణ్, పట్టణ ప్రధాన కార్యదర్శులు సామల అశోక్, ఎడ్ల సాగర్, పట్టణ కార్యదర్శి దూడపాక రోజ, పార్వతి, విష్ణు, మాచిడి శ్రీధర్, పట్టణ కోశాధికారి వొడ్నాల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News