Friday, 31 July 2026 09:28:08 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఉపాధి హామీ పథకం పేరు మారుస్తే గ్రామీణ పేదలకు పొట్ట కొట్టడం కాయం

Date : 24 January 2026 07:31 PM Views : 280

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పేరును మారిస్తే నిరుపేదల పొట్ట కొట్టడం ఖాయమని కాటారం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమనూరీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని ఇబ్రహీంపల్లి, అంకుశాపూర్, గ్రామాలలో ఉపాధి హామీ కూలీలతో గ్రామ సభలు నిర్వహించారు. 2006 సంవత్సరంలో నాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సోనియా గాంధీ ఆధ్వర్యంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానిగా ఉన్నప్పుడు పేదవానికి రక్షణ కల్పించే దిశగా ఉపాధి చట్ట రూపకల్పన చేయడం జరిగిందన్నారు. దాన్ని చట్ట రూపం దాల్చి హక్కుగా పెట్టడంతో ఇది గిట్టని కార్పొరేట్ సంస్థలకు వత్తాసు పలుకుతున్న బీజేపీ ప్రభుత్వం గ్రామీణ నిరుపేదల పొట్ట కొడుతుందని ఆరోపించారు. చట్టంలోని డిమాండ్ ను తొలగించి సప్లై అంశాన్ని తీసుకువచ్చి కూలీల పనితనాన్ని తగ్గించి మళ్లీ యంత్రాలను ఉపయోగించుకునేలా చట్ట రూపకల్పన చేసినారని ఆరోపించారు. ఇది ఉపాధి హామీ చట్ట నిబంధనలకు పూర్తి విరుద్ధమని, అలాగే కేంద్ర ప్రభుత్వం స్థానిక సంస్థలైన జిల్లా పరిషత్ మండల పరి షత్ గ్రామపంచాయతీ అధికారాలను, హక్కును కాలరాసింది. పేదవాడిని పొట్ట కొట్టే దిశగా గతంలో 90 రోజుల పని దినాలలో కేంద్ర ప్రభుత్వం చెల్లించగా నేడు 125 రోజుల పేరుతో రాష్ట్రాలపై భారం నెట్టి కేవలం 70 రోజులకు మాత్రమే కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తుందని మిగతా 55 రోజులను రాష్ట్ర ప్రభుత్వాలు భరించాలని నిబంధన విధించింది. ఇది పూర్తిగా ఎంజి ఎన్ఆర్ఇజిఎస్ చట్టానికి విరుద్ధమని అంతేకాకుండా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంలో పనులను నిర్ణయించుకునే అధికారం కూలీలకు గ్రామస్తులకు ఉండేది కానీ నేడు ఈచట్ట మార్పు వల్ల ఆ అధికారాన్ని కోల్పోయి సంవత్సరానికి 60 రోజులను క్రాప్ హాలిడే పేరిట గ్రామీణులను వారి జీవితాలను ఆగం. ఇంత తీవ్రమైన చర్యలకు పాల్పడుతున్న బిజెపి ప్రభుత్వాన్ని కేంద్రంలో ఉన్న మోడీ చర్యలను తీవ్రంగా ఖండించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కాటారం మాజీ ఎంపీపీ పంతకాని సమ్మయ్య, మండల కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ కుంభం రమేష్ రెడ్డి, సర్పంచులు దెబ్బట సరోజన రాజేష్, సోదారి కల్పన దేవయ్య, ఉపస ర్పంచ్ కర్క ఉమా శంకర్, చీర్ల తిరుపతిరెడ్డి, చాంద్ పాషా, ఆత్మకూరి కుమార్ యాదవ్, గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: