ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ప్రభుత్వ పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మంచిర్యాల జిల్లా కాసిపేట మండల కేంద్రంలో కొనసాగుతున్న అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు, భోజనశాల, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలలో సకల సదుపాయాలు కల్పించి నిష్ణాతులైన ఉపాధ్యాయుల ద్వారా విద్యాబోధన అందిస్తుందని,ఈ క్రమంలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించాలని తెలిపారు. అనంతరం మండల కేంద్రంలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనులను పరిశీలించారు. నిరుపేదలకు గూడు కల్పించే ఉద్దేశంతో ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకంలో అర్హులైన లబ్ధిదారులు ఎంపిక చేసి ఇండ్లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు.లబ్ధిదారులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇండ్లకు నిర్మించుకోవాలని,ప్రభుత్వం కల్పిస్తున్న ఉచిత ఇసుకను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. మండలంలోని రేగులగూడ గ్రామంలో గల ప్రభుత్వ గిరిజన బాలుర ఆశ్రమ ఉన్నత పాఠశాలను సందర్శించి తరగతి గదులు,పరిసరాలు, మెనూ అమలు సమస్యలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News