Thursday, 30 July 2026 07:20:01 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ తేజస్విని ఆత్మహత్య కేసులో వింత మలుపు...

మృతదేహం లభ్యం..! విగ్రహం కోసం గాలింపు...

Date : 19 July 2026 11:53 PM Views : 82

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : హైదరాబాద్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ తేజస్విని ఆత్మహత్య కేసులో వింత మలుపు జరిగింది. ఆర్థిక లావాదేవీలు, డెత్ డిక్లరేషన్‌పై ముమ్మర దర్యాప్తు జరుపుతున్నారు. పోలీసుల కథనం ప్రకారంతేజస్విని తన దుస్తులు విప్పేసి, దిగంబరంగా సమీపంలోని ఒక గుడిలోకి ప్రవేశించింది. అక్కడ ఉన్న అమ్మవారి విగ్రహాన్ని చేతుల్లోకి తీసుకుని నేరుగా సమీపంలోని చెరువు వైపు నడిచి, నీటిలోకి దూకింది. ఆ తర్వాత ఆమె మృతదేహం లభ్యమవగా, ఆమె తీసుకెళ్లిన విగ్రహం మాత్రం ఇంకా దొరకలేదు. ఈ కేసులో ఆ విగ్రహం కీలక ఆధారంగా మారే అవకాశం ఉండటంతో, డీఆర్ఎఫ్ సిబ్బంది బోట్ల సహాయంతో చెరువులో విగ్రహం కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ దర్యాప్తులో తేజస్విని ఉంటున్న నివాసానికి సంబంధించిన కొన్ని షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఆమె ఒక అద్దె ఫ్లాట్‌లో ఉంటున్నట్లు, దానికి రోజుకు రూ. 3,500 చొప్పున నెలకు దాదాపు రూ. లక్ష వరకుఅద్దెచెల్లిస్తున్నట్లు పోలీసులుగుర్తించారు. అంతేకాకుండా, ఆమె ఉంటున్న భవనంలోని పై రెండు అంతస్తులను అక్రమంగా ఒక లాడ్జిలానిర్వహిస్తున్నట్లు గుర్తించారు. దీనికి తేజస్విని మృతికి ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఘటనను ఆత్మహత్యగా అనుమానిస్తున్నప్పటికీ, ఆమె అలా ప్రవర్తించడానికి గల అసలు కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసులు తేజస్విని తల్లి అరుణను ప్రశ్నించడంతో పాటు, ఆమె రాసినట్లుగా భావిస్తున్న డెత్ డిక్లరేషన్, ఇటీవలి ఆర్థిక లావాదేవీలు, సీసీటీవీ ఫుటేజీలను నిశితంగా పరిశీలిస్తున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :