ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : శ్రీ సీతారాముల కళ్యాణానికి భద్రాచల సీతారామ చంద్రస్వామి ఆలయంలో అధికారులు సర్వం సిద్ధం చేశారు. శుక్రవారం శ్రీరామనవమి పురస్కరించుకొని జగదభిరాముని కళ్యాణం తిలకించడానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల నుండి కూడా వేలాది మంది భక్తులు తరలి రావడంతో ఆలయ అధికారులతో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు అన్ని ఏర్పాట్లు చేశారు. కళ్యాణాన్ని చూడడానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చలువ పందిళ్లను కూడా ఏర్పాటు చేశారు. అంతేగాకుండా భక్తులకు తాగునీటి వసతితో పాటు అల్పాహారం కూడా అందించడానికి ఏర్పాటు చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. శ్రీ సీతారాముల కల్యాణానికి ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. అలాగే ముత్యాల తలంబ్రాలు కూడా అందించనున్నారు. కళ్యాణాన్ని తిలకిచడానికి మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు ఉన్నతాధికారులు అలాగే ప్రజల సైతం ఇప్పటికే భద్రాచలం చేరుకోవడంతో ఆలయ ప్రాంగణమంతా జన సంద్రంతో కిక్కిరిసిపోయింది. అంతేకాకుండా పట్టణాలు పల్లెల్లో సైతం ఆంజనేయస్వామి దేవాలయాల ఆవరణలో సీతారాముల కళ్యాణం జరిపించడంతో పాటు భక్తులకు అన్న ప్రసాద వితరణకు ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు యంత్రాంగం భారీ భద్రత ఏర్పాటు చేసింది.
Admin
E Nivas News