Thursday, 30 July 2026 06:09:04 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

రైతులను మాయ మాటలతో మోసం చేసిన ప్రభుత్వం...

పోస్ట్ కార్డు ద్వారా ప్రభుత్వం స్పందించాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్

Date : 19 March 2026 07:13 AM Views : 186

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి రైతుల తోపాటు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రభుత్వాన్ని విమర్శించారు. బుధవారం పట్టణంలోని విశ్రాంతి భవనంలో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ రైతు భరోసా ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీల అమలు చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులు వాటిని మర్చిపోయారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి తో పాటు మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ దీనికి బాధ్యులేనని ధ్వజమెత్తారు. రైతులను గోస పెడుతున్న ప్రభుత్వం ఎక్కువ రోజులు అధికారంలో ఉండడం కష్టమన్నారు . ఇప్పటికే ప్రజలు విసిగి వేసారి పోతున్నారన్నారు. ఒక విడత రైతు భరోసాను ఎగొట్టి రైతులకు అన్యాయం చేశారన్నారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజలను విస్మరించి పాలన చేయడం సబబు కాదని విమర్శలు గుప్పించారు. 10 వేల మంది రైతులతో ముఖ్యమంత్రికి పోస్ట్ కార్డ్స్ ద్వారా రైతు భరోసా, ఇతర హామీలు నెరవేర్చాలని కోరుతూ పోస్ట్ చేశామన్నారు. అంతేకాకుండా ఎరువుల కోసం గత ప్రభుత్వంలో ఏనాడైన రైతులు ఇబ్బంది పడిన దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేయకుంటే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హెచ్చరించారు. అన్ని వర్గాలకు అన్యాయం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్ రావు, మాజీ డీసీఎమ్మెస్ చైర్మన్లు తిప్పని లింగయ్య, కేతిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కాంతయ్య,మాజీ వైస్ చైర్మన్ పోడేటి శ్రీనివాస్ గౌడ్,మండల అధ్యక్షులు చుంచు చిన్నయ్య, సర్పంచ్ ఎల్తపు సుధాకర్, చాంద్, రవి, తిరుపతి, కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :