Friday, 31 July 2026 03:59:20 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

మరిపెడ మున్సిపాలిటీ చైర్‌పర్సన్‌గా వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి, వైస్ చైర్మన్ గా కాలం సునీత రవీందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం..

అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతాం..

Date : 16 February 2026 09:37 PM Views : 138

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో నూతన చైర్ పర్సన్ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది. నూతన మున్సిపల్ చైర్‌పర్సన్‌గా వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయగా, వైస్ చైర్‌పర్సన్‌గా కాలం సునీత రవీందర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.మరిపెడ మున్సిపల్ లో నూతనంగా గెలుపొందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు , బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్లు , ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్ ముఖ్య అతిథిగా హాజరై నూతనంగా ఎన్నికైన మరిపెడ మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌లను అధికారికంగా ప్రకటించారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో సాగగా, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్ మాట్లాడుతూ.. డోర్నకల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటామన్నారు. అభివృద్ధే తమ లక్ష్యమని స్పష్టం చేశారు.నూతన చైర్‌పర్సన్ వీసారపు ప్రగతి శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజలు ఇచ్చిన గెలుపు బాధ్యతగా భావించి పట్టణ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. ముఖ్యంగా డ్రైనేజీ వ్యవస్థ, వీధి లైట్ల ఏర్పాటు, పారిశుధ్యం, పరిశుభ్రత కార్యక్రమాలను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు మౌలిక వసతులు మెరుగుపరచడమే తమ ప్రథమ కర్తవ్యమని అన్నారు. వైస్ చైర్‌పర్సన్ కాలం సునీత రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి కౌన్సిలర్‌తో కలిసి సమన్వయంతో పని చేస్తూ మున్సిపాలిటీ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. పట్టణ పరిశుభ్రత, మౌలిక సదుపాయాల బలోపేతం ప్రజలకు మెరుగైన సేవలు అందించడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న వివిధ వార్డు కౌన్సిలర్లు, రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలకు సహకరిస్తామని వెల్లడించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పారదర్శక పాలన అందించాలని, మరిపెడ మున్సిపాలిటీలో నూతన నాయకత్వ బాధ్యతలు స్వీకరించడంతో పట్టణ అభివృద్ధిపై ప్రజల్లో ఆశలు పెరిగాయి. కొత్త పాలకవర్గం చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాలు మున్సిపాలిటీ రూపురేఖలను మార్చే దిశగా సాగుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు వంటికొమ్ము యుగంధర్ రెడ్డి, స్నేహా యూత్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ జిల్లా యువ నాయకులు నూకల అభినవ్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెండ్లి రఘువీరారెడ్డి, కేసముద్రం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పెద్ద బోయిన ఐలమల్లు, పట్టణ అధ్యక్షులు షేక్ తాజుద్దీన్, మాజీ సర్పంచ్ పానుగోతు రాంలాల్,మాజీ ఎంపీటీసీ గంధసిరి అంబరీష, షేక్ అఫ్జల్, కాలం రవీందర్ రెడ్డి, మచ్చ వెంకట నరసయ్య, అల్వాల ఉపేందర్ ప్రజాపతి, గంధసిరి బిక్షపతి, పొన్నం వినయ్ ,ముదిరెడ్డి నరేష్ రెడ్డి, నల్లు శ్రీకాంత్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ యుత్ అధ్యక్షులు బానోత్ నరేష్, వెంకన్న, మహేష్, కొన్నే సోమన్న, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :