Thursday, 30 July 2026 08:13:58 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... జిల్లా ఆరోగ్య వైద్యాధికారి నరేందర్ రాథోడ్..

Date : 07 July 2026 11:13 PM Views : 95

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : సీజనల్ వాదుల పట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారి నరేందర్ రాథోడ్ సూచించారు. మంగళవారం లక్షెట్టిపేట వేదికలో జన్నారం,దండ పెళ్లి తాళ్ల పేట, వెంకట్రావుపేట్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆశ ఆరోగ్య కార్యకర్తలు వైద్యులతో జిల్లాలో వర్షాలు పడుతున్నందున వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకొనడంలో భాగంగా ముందస్తు చర్యల్లో భాగంగా అందరిని సన్నద్ధం చేశారు. అదేవిధంగా ప్రతి ఆశ ఆరోగ్య కార్యకర్తల దగ్గర మందులు అందుబాటులో ఉండాలని కీటక జంట వ్యాధులు,దోమల ద్వారా వచ్చే వ్యాధులు మలేరియా డెంగ్యూ చికెన్ గునియా, మెదడు వాపు పైలేరియా వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని దోమలు కుట్టకుండా పెరగకుండా చూసుకోవాలని దానికోసంగ్రామపంచాయతీ,మున్సిపల్ సిబ్బంది సహకారంతో స్థానిక ప్రజాప్రతినిధులు సర్పంచుల సహకారంతో ప్రివెంట్ స్టెప్స్ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని పరిసరాల పరిశుభ్రత మరియు నీటి ద్వారా వచ్చే వ్యాధులు టైఫాయిడ్ అతిసార లాంటి వ్యాధులురాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మంచినీటిని తీసుకోవాలని ప్రజలలో అవగాహన కలిగించాలని తెలిపారు. ముఖ్యంగా మాతా శిశు సంరక్షణలో భాగంగా లక్షెట్టిపేటప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు చేయడానికి అన్ని రకాల సౌకర్యాలు అందుబాటులో ఉన్నందున ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గర్భవతులకు ఆశ, ఆరోగ్య కార్యకర్తలు ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు చేయించాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో ఆశ ఆరోగ్య కార్యకర్తలకు మరియు వైద్యులకు,వైద్య సిబ్బందికి సమన్వయం కోసం హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఆశ కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు గర్భవతులను ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకొని వెళ్లరాదని వెళ్లినచో తగు చర్యలు తీసుకుంటామని, అదేవిధంగా గర్భవతులకు అన్ని రకాల పరీక్షలు వైద్యులు వైద్య సిబ్బందితో చేయించాలని తెలిపారు.102 సర్వీసులను ఉపయోగించుకోవాలని స్కానింగ్ కోసం ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు వైద్య సిబ్బంది సుప్రవేజర్లుముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని తెలిపారు.వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున ప్రభావిత ప్రాంతాలలో రెసిడెన్షియల్ పాఠశాలలో హాస్టల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పరీక్షల నిర్వహించి మందులు అందజేయరన్నారు.ఆర్ బి ఎస్ కే టీములు పాఠశాలలను సందర్శించాలన్నారు. ముఖ్యంగా కీటకాల ద్వారా వచ్చేవ్యాధులు, క్షయ వ్యాధి నియంత్రణ లో భాగంగా ముందస్తుగా క్షయ వ్యాధి గుర్తించడం, చెమట పరీక్ష చేయడం పోర్టేబుల్ ఎక్స్సిరీ మిషన్ల ద్వారా గ్రామాలకి వెళ్లి క్షయ వ్యాధి వ్యక్తులను గుర్తించి ఆన్లైన్ పోర్టల్ లో నమోదు చేయాలన్నారు. అదేవిధంగా పోషకాహారం కోసం క్షయ వ్యాధిగ్రస్తులకు కిట్టులను అందజేయాలని ఆదేశించారు.ఆశ ఆరోగ్య కార్యకర్తలు గ్రామాలలో సమన్వయం చేస్తూ చర్యలు చేపట్టాలని ఐసిడిఎస్ అంగన్వాడి కార్యకర్తలు గ్రామపంచాయతీ సిబ్బంది మున్సిపల్ సిబ్బంది విద్యాశాఖ టీచర్లు మరియు గ్రామాలలో ఉన్న మహిళా గ్రూపులతో సమన్వయం చేసుకుంటూ ఆరోగ్య సేవలు అందించాలన్నారు. జాతీయ కార్యక్రమాల్లో ముందుండాలని సూచించారు.ప్రతినెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారీగా సమీక్ష చేయడం జరుగుతుంది. ఎలాంటి సమస్యలున్న పరిష్కారము మరియు వైద్యులు వైద్య సిబ్బంది సమన్వయం తో ఉండి సమయపాలన పాటిస్తూ ప్రజలకు సరైన సేవలు అందించాలని సూచించారు.ఇలాంటి పొరపాట్లు జరిగిన చర్యలు తీసుకొనడానికి సిద్ధంగా ఉన్నామని, వైద్యవృత్తిని ఉపయోగించుకొని సేవలందించాలన్నారు.ఈ కార్యక్రమంలో ఉప జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి మరియు ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ సుధాకర్ నాయక్ డాక్టర్ అరుణశ్రీ,డాక్టర్ సమత లక్షెట్టిపేట ప్రభుత్వం ఆస్పత్రి సంచాలకులు డాక్టర్ శ్రీనివాస్ వైద్యులు వైద్య సిబ్బంది మరియు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ నుండి మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్,ఎండి రషీద్, అల్లాడి శ్రీనివాస్, సి హెచ్ ఓ లు,నాందేవ్,టి పి హెచ్ ఎన్ ఆర్ఎస్ దేవేందర్,క్షయ వ్యాధి సిబ్బంది హెచ్ఐవి ఎయిడ్స్ సిబ్బంది దిశా సిబ్బంద మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ ఆశా ఆరోగ్య కార్యకర్తలు, సూపర్వైజర్లు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :