Friday, 31 July 2026 05:34:25 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

వడియరాజు'శ్రీ కందులపురం తమ్మిశెట్టి వెంకటస్వామి రాజు సేవ భావం

Date : 23 November 2025 05:54 PM Views : 322

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : కందులపురం జమీందారు తమ్మిశెట్టి వెంకటస్వామి రాజు 23-11-1906లో తల్లిదండ్రులైన తమ్మిశెట్టి వెంకటప్పయ్య తల్లి లక్ష్మీదేవమ్మా దంపతులకు జన్మించారు. ఈయన వడియరాజుల ఆరాధ్య దైవం, వడియరాజ క్షత్రియ సంఘం 1942లో స్థాపకుడిగా పేరుపొందారు. శ్రీదేవి మూలిక ఫార్మసీ ద్వారా పనుల్లో గాయపడిన కార్మికులకు స్వయంగా వైద్యం చేసి మరీ సేవ చేశారు. మహిళా గౌరవ పరిరక్షకుడిగా ఆ కాలంలో ఉన్న కట్టు, బొట్టు, వేషధారణలో మార్పులు చేసి స్త్రీ శక్తి, స్త్రీ గౌరవం అనే విలువను సమాజంలో నిలబెట్టారు. గోత్రాలు, వరుసలు ఆధారంగా సక్రమమైన వివాహ వ్యవస్థను బలపర్చి కుల ఐక్యతను పెంచారు. 'ఐకమత్యమే మహా బలం' అని చెబుతూ వడియరాజుల మధ్య అపార ఐక్యాన్ని నెలకొల్పారు. తన భూములు సంతానానికి కాకుండా వడియరాజులలోని నిరుపేదలకు దానం చేశారు.1942లో వడియరాజ క్షత్రియ సంఘ స్థాపకుడు చేసి, జీవితాన్ని అప్పగించి కుల అభివృద్ధికి అంకితం చేశారు. చెప్పులు లేకపోయినా గ్రామాలు తిరిగి జాతి అభ్యుదయానికి కృషి చేశారు. పేదలకు అన్నదాన సేవలు చేస్తూ తమ ఇంటి వద్ద పేదలకు నిత్యం అన్నదానం నిర్వహించారు. వడియరాజుల చరిత్రను వారి మూలాలను పరిశోధించి వంశ చరిత్రను సంరక్షించిన వాడు. పెళ్లిళ్లకు బంగారు తాళిబొట్టు దాతగా అనేక పేద కుటుంబాల పెళ్లిళ్లకు బంగారు తాళిబొట్టు దానం చేశారు. తుది శ్వాస వరకు సమాజ సేవ చేసి జీవితం మొత్తం వడియరాజుల అభివృద్ధికే అంకితమై గడిపారు.

"స్త్రీకి గౌరవం లేని కాలంలోనే వడియరాజ క్షత్రియ మాతకు జై!" అనే నినాదంతో ప్రజలను ఉత్తేజపరిచారు. రేడియో కూడా విస్తరించని రోజుల్లో చైతన్య యాత్రలు చేసి రాష్ట్ర నలుమూలలకు తిరిగి సామాజిక అవగాహన, చైతన్యం కల్పించారు. తిరుమలలో ఏనుగుపై ఊరేగే హక్కు కేవలం శ్రీ వెంకటేశ్వరస్వామికి మాత్రమే ఉన్న రోజులలోగజ రాజుపై ఊరేగిన గజపతిరాజు తమ్మిశెట్టి వెంకటస్వామి రాజు బ్రిటిష్ పాలనలోనే ఏనుగుపై భారత జాతీయ జెండా ఎగురవేసిన స్వాతంత్య సమర వీరుడు. బ్రిటిష్ అధికారిని చెట్టుకు కట్టించిన సంఘటన తరువాత గద్వాల్ మహారాణి సన్మానించారు. తరువాత మైసూరు పాలస్ చల్లా రోసిరాజ వడియర్ ప్రత్యేక ఆహ్వానం అందించారు. వడియరాజుల శ్రీనాథునికి అవమానం చేసిన వంశంలో పుట్టినా, తానే ముంగర మల్లిఖార్జున రాజును కవి సార్వభౌముడిగా తీర్చిదిద్దిన మహాగురు. గిరిపురంలో పెద్ద సభ ఏర్పాటు చేసి అనేక మంది జమీందారులు, పండితులు, వడియరాజ నాయకులను ఆహ్వానించి స్వాతంత్ర్య సంగ్రామానికి ప్రజలను ఉత్తేజపరిచారు. ఆ సమావేశానికి హాజరైన ప్రముఖ 48 మంది జాబితా చరిత్రలో నిలిచిపోయింది. 'వడియరాజుల ఆత్మగౌరవాన్ని' తిరిగి నిలబెట్టి, భూములు దానం చేసి, బ్రిటిష్ పాలనలోనే ఏనుగుపై జాతీయ జెండా ఎగురవేసిన మహాయోధుడు కందులపురం తమ్మిశెట్టి వెంకటస్వామి రాజు. ఈయన వడియరాజుల మూల పురుషుడిగా ప్రఖ్యాతి చెందారు --డా.ఓర్సు రాయలింగు 9849446027

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :