Thursday, 30 July 2026 04:59:01 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ సోదాలు..! వారసత్వ భూమి వ్యవహారంలో రూ.10 వేల లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఆర్‌ఐ

Date : 14 May 2026 11:26 PM Views : 99

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : వరంగల్ గ్రామీణ జిల్లా దుగ్గొండి తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు గురువారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. వారసత్వ భూమికి సంబంధిత ఫైల్ పరిష్కారం కోసం రూ.10 వేల లంచం తీసుకుంటున్న రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌ఐ ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మండలంలోని మధిర గ్రామానికి చెందిన లొల్లాటి రాజు తన తండ్రి నర్సయ్య మరణంతో తన తండ్రి పేరు మీద ఉన్న 27 గుంటల వ్యవసాయ భూమి పట్టా చేసుకునేందుకు వారసత్వ భూమి నమోదు ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకోగా, సంబంధిత ఫైల్‌ను ముందుకు జరిపేందుకు ఆర్‌ఐ రూ.10 వేల లంచం డిమాండ్ చేసినట్లు సమాచారం. బాధితుడు ఈ విషయాన్ని ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు పక్కా ప్రణాళికతో డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నారు. తహసీల్దార్ కార్యాలయంలోనే లంచం తీసుకుంటున్న సమయంలో అధికారులు ఆర్‌ఐను అదుపులోకి తీసుకుని, నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కార్యాలయంలో పలు రికార్డులను పరిశీలించి, సంబంధిత పత్రాలను సీజ్ చేసినట్లు తెలిసింది. ఈ ఘటనతో తహసీల్దార్ కార్యాలయంలో ఒక్కసారిగా కలకలం రేగింది.. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :