ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలంలోని ఉమ్మడి గ్రామ పంచాయతీ చిదినేపల్లి ప్రతా పగిరి.(సిపిపిఎల్) ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ఉమ్మడి గ్రామ పంచాయతీ క్రీడకారులందరికి ఊర నంద కిషోర్ బాబు. వారి ధర్మ పత్ని ఊర సుసాన్ రావు. ఆధ్వర్యములో ఈనెల 9న ప్రారంభం కాగా గురువారం మధ్యాహ్నానికి ఫైనల్ కావడం జరిగింది. ఫైనల్లో దంతలపల్లి డేంజర్11 ప్రతాపగిరి టీంలు తలపడగా ప్రతాపగిరి డేంజర్11 గెలిచి ప్రథమ బహుమతి రూ. 15 వేలు, షీల్డ్. పొందారు. ద్వి తీయ బహుమతి దంతల పల్లి రూ. 5 వేలు, తృతీయ బహుమతి శ్రీనివాస కాలనీ. 2500.రూపాయలు ఊర నంద కిషోర్ బాబు వారి ధర్మ పత్ని చేతుల మీదుగ అందజేశారు. ఈకార్యక్రమంలో ప్రతాపగిరి సర్పంచ్ వూర వెంకటే శ్వర్ రావు, సర్పంచ్ బాల్నే జగదీశ్వర్ రెడ్డి, 5 గ్రామాల క్రీడాకారులు, గ్రామ పెద్దలు, అధిక సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
Admin
E Nivas News