ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ బిజెపి పార్టీలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జైల్లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ను పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ అభ్యర్థులను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని కొన్ని మున్సిపాలిటీల్లో ప్రజా తీర్పును అపహాస్యం చేస్తున్నారని మండిపడ్డారు. ఖ్యాతనపల్లి మున్సిపాలిటీలో టిఆర్ఎస్ పూర్తిస్థాయిలో ఆధిపత్యం సాధించిందని అయినా కూడా మంత్రి అధికార దుర్వినియోగానికి తెరలేపి ప్రజలను రెచ్చగొట్టి అనవసరమైన కేసులు బనాయిస్తున్నారని అన్నారు. సర్పంచ్ మునిసిపల్ ఎన్నికల్లో టిఆర్ఎస్ ఏం తక్కువగా ఎక్కడ పోలేదని తెలిపారు. జైలుకుపోవడం మా నాయకులకు తక్కువేం కాదన్నారు. తమ ప్రభుత్వం వచ్చాక తామేం చేయాలో తెలుసునన్నారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే లు గంగుల కమలాకర్, అనిల్ జాదవ్, మాజీ మంత్రి జోగు రామన్న, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News