ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / కురవి : మహబూబాబాద్ జిల్లా కురవి మండలం లింగ్యాతండా(బి) గ్రామపంచాయితీ పరిధిలో స్థానిక మాజీ సర్పంచ్ గుగులోతు రాంలాల్ నాయక్, ఆధ్వర్యంలో పంచాయితీ పరిధిలో గల రెండు అంగన్వాడీ సెంటర్లకు 10 కుర్చీలు బహుకరించారు. మొదటి అంగన్వాడీ సెంటర్ కు మాజీ సర్పంచ్ గూగులోతు రాంలాల్ నాయకు 5 కుర్చీలు బహుకరించారు రెండవ అంగన్వాడీ కి స్థానిక బీ ఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు మాలోత్ రవికుమార్ నాయక్ , మరో ఐదు కుర్చీలు బహుకరించారు ఈ కార్యక్రమంలో బలపాల గ్రామ బీ ఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నామ సైదులు , పొట్టి సీనియర్ నాయకులు రొయ్యల నాగేశ్వర్ రావు, లింగ్యాతండా(బి) గ్రామ మాజీ వార్డు సభ్యులు, భుక్య నాగేష్, మాలోత్ మోహన్, మాలోత్ లక్ష్మణ్, బానోతు చందర్, మాజీ ఉప సర్పంచ్ ఇస్లావత్ దేవేందర్, వార్డు సభ్యులు భుక్య రవి, మాలోత్ సంతోష్, గ్రామ BRS నాయకులు సెట్రామ్, వీరన్న, సదర్లాల్, సురేష్, శ్రీకాంత్, అనిల్, వెంకన్న, అశోక్, తేజ్య, హరిలాల్, కిషన్ నాయక్లతో పాటు అంగన్వాడీ టీచర్లు దేవమణి, కుమారి, ఆయాలు విజయ, అరుణ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News