ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఖమ్మం అంటేనే వ్యవసాయం అని, వ్యవసాయం అంటేనే ఖమ్మం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. గత ప్రభుత్వం రైతులకు 72 వేల కోట్లు ఖర్చు చేస్తే, తమ ప్రభుత్వం రెండేళ్లలోనే 34 వేల కోట్లు నేరుగా రైతులకు అందించిందని తెలిపారు. మొత్తం వ్యవసాయ రంగం కోసం రూ.1,67,877 కోట్లు కేటాయించామని, పంటల బీమా, క్రాప్ డ్యామేజ్, ఫార్మ్ మెకనైజేషన్, ఆత్మీయ భరోసా వంటి పథకాల ద్వారా ఈ నిధులు ఖర్చు చేస్తున్నామని వివరించారు. ఇంకా రైతులకు అండగా ఉండాలని ఉద్దేశంతో ప్రభుత్వం అన్ని రకాల సమాలోచనలు చేస్తుందని తెలిపారు. రైతే రాజుగా ఎదగాలన్నదే ప్రభుత్వ ధ్యేయమన్నారు.
Admin
E Nivas News