ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణ రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికను తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. బుధవారం రోడ్లు&భవనాల శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో కలిసి హాజరయ్యారు. రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధి ప్రణాళికలు,పురోగతిపై స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్,సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు తదితర ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం బుధవారం నిర్వహించారు. సందర్భంగా సీఎం మాట్లాడుతూ 2047 విజన్ డాక్యుమెంట్‌కు అనుగుణంగా రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని, హైదరాబాద్ నగరం నుంచి రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా నిర్ణీత సమయంలో చేరుకునేలా రోడ్ల నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలని ఆదేశించారు. హైదరాబాద్‌ను ట్రాఫిక్ ఫ్రీనగరంగాతీర్చిదిద్దేందుకు కనెక్టివిటీ రోడ్ల అభివృద్ధికి అవసరమైన చర్యలను గుర్తించి అమలు చేయాలని తెలిపారు. ఇప్పటికే గుర్తించిన ప్రాంతాల్లో రోడ్ల అభివృద్ధి పనులు త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ,రెవెన్యూ శాఖలతో సమన్వయం చేసుకుంటూ సమస్యలు తలెత్తకుండా స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. ప్రతీ ప్రధాన జిల్లా కేంద్రంలో రింగ్ రోడ్ల అభివృద్ధి అంశాన్ని అధ్యయనం చేసి,ఆ రింగ్రోడ్లనుజాతీయ,రాష్ట్ర హైవేలకు అనుసంధానం చేసే అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. సాధ్యాసాధ్యాలపై సమగ్ర అధ్యయనం చేసి పూర్తిస్థాయి ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. అలాగే టీచింగ్ హాస్పిటల్స్, పెద్ద ఆసుపత్రుల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి పేదలకు మరింత మెరుగైన వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి సూచించారు.
Admin
E Nivas News