Thursday, 30 July 2026 08:14:07 AM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు...

ఆందోళన చెందుతున్న ప్రజలు

Date : 29 July 2026 09:04 PM Views : 13

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గే అవకాశం ఉండటంతో వరి ఉత్పత్తిపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో బియ్యం ధరలకు రెక్కలు రావడంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిని ఆసరాగా చేసుకుని వ్యాపారులు బియ్యం నిల్వలు పెంచుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గత కొన్ని వారాలుగా బియ్యం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. సాధారణ బియ్యంతో పాటు సన్నబియ్యం, ప్రీమియం రకాల ధరలుకూడాపెరగడంతో వినియోగదారులపై అదనపు పడిందంటున్నారు. 26 కిలోల బస్తా ధరలో రూ.100 నుంచి రూ.300 వరకు పెరుగుదల నమోదైనట్లు వ్యాపార వర్గాలు వెల్లడించాయి. రిటైల్ మార్కెట్‌లో కిలోకు రూ.3 నుంచి రూ.10 వరకు అదనంగా వసూలు చేస్తున్నారు.ఎగుమతుల పెరుగుదల, ఇతర రాష్ట్రాల నుంచి డిమాండ్ అధికంగా ఉండటం కూడా ధరల పెరుగుదలకు మరో కారణంగావ్యాపారులు చెబుతున్నారు.వ్యాపారులుకృత్రిమ కొరత సృష్టించి అధిక ధరలకు విక్రయించే ప్రయత్నాలుజరగకుండా అధికారులు బియ్యం మార్కెట్లపై నిఘా పెంచారు. నిల్వలు, సరఫరాపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. అయినా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందనే ఆందోళనతో వినియోగదారులు ముందుగానే బియ్యం కొనుగోలు చేస్తున్నారు. దీంతో మార్కెట్‌లో డిమాండ్ మరింత పెరుగుతోంది. ఏది ఏమైనా ప్రభావంతో సామాన్యుడికి నిత్యావసర సరుకులు కూడా కొనుగోలు చేయడానికి కష్టతరంగానే మారుతున్నాయి అనడంలో సందేహం లేదని అభిప్రాయాలు సర్వత్ర వ్యక్తం అవుతున్నాయి.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :