ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని ధన్నూర్ గ్రామంలో కురిసిన అకాల వర్షం కారణంగా తడిసిన జొన్న కుప్పలను మంగళవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులతో మాట్లాడి వారికి ధైర్యం కల్పించారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతోనే రైతులు నష్టపోతున్నారని అన్నారు. అకాల వర్షం కారణంగా తడిసిన ప్రతీ గింజను ప్రభుత్వం బేషరతుగా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే వెంట మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Admin
E Nivas News