ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలను శనివారం విద్యాసంస్థల తో పాటు ఆయా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పలువురు విద్యావంతులు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపూలే సావిత్రిబాయి పూలే దంపతులు విద్యారంగానికి చేసిన సేవలు ఎన్నటికీ దేశానికి ఆదర్శమన్నారు. నేడు మహిళలంతా ఉద్యోగరీత్యా పలు రంగాల్లో ఉన్నారంటే దానికి నిదర్శనం సావిత్రిబాయి పూలే అని గుర్తు చేశారు. మహాత్మ జ్యోతిబాపూలే ఎన్ని అవమానాలు భరించిన పట్టించుకోకుండా తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించిన గొప్ప మహనీయుడు అన్నాడు. నేడు ఆయన పేరుతో ప్రభుత్వాల సైతం విద్యాసంస్థలను నెలకొల్పి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్యానందించడం చిరస్మరణీయమన్నారు.
విద్యాసంస్థల్లో విద్యార్థులు వ్యాసరచన ఉపన్యాస పోటీల్లో పాల్గొనడంతో పాటు వారి యొక్క జీవిత కథను కనులకు కట్టినట్టుగా నాటక ప్రదర్శన నిర్వహించి పలువురుని ఆకట్టుకున్నారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఆయా పాఠశాలల ప్రధాన ఆచార్యులు బహుమతులు అందజేశారు.
Admin
E Nivas News