ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : బడుగు బలహీన వర్గాల పిల్లల విద్యాభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేసి విజయం సాధించిన మహాత్మ జ్యోతిబాపూలే దంపతులు ఆదర్శనీయులని మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాల, కళాశాల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమన్వయకర్త షేరు శ్రీధర్ అన్నారు. గుడి పేట మహాత్మ జ్యోతిబాపూలే గురుకులంలో శుక్రవారం శుక్రవారంఆయన పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లక్షెట్టిపేట మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాల కళాశాలలో మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటానికి ప్రిన్సిపల్ సిహెచ్. ప్రిన్సిపల్ సిహెచ్. మంగ పూలమాలలు వేసి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ సిహెచ్. మంగ మాట్లాడుతూ పేద పిల్లల విద్య కోసం మహాత్మ జ్యోతిబాపూలే నిరంతరం శ్రమిస్తే అదే బాటలో ఆడపిల్లలు కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నా ఆలోచనతో సావిత్రిబాయి పూలే కూడా ముందడుగు వేయడం మహిళా లోకానికి నిదర్శనం అన్నారు. నేడు ప్రపంచంలో ఏ రంగంలో చూసిన మహిళలే ఎక్కువ శాతం అని రంగాల్లో పనులు చేస్తున్నారని తెలిపారు. రజాకార్ల కాలంలో ఇద్దరు ఎన్నోసార్లు అవమానాలకు గురైన వాటిని తట్టుకొని వారు అనుకున్నదే ధ్యేయంగా పనిచేయడం వారి పట్టుదలకు నిదర్శనం అన్నారు. వారు చేసిన విద్యాభివృద్ధిని గుర్తించిన ప్రభుత్వం మహాత్మ జ్యోతిబాపూలే పేరిట దాదాపు 270 పాఠశాలలు,కళాశాలలు, డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిందని తెలిపారు. ఈ గురుకులాల్లో కేవలం పేద విద్యార్థులే చదువుకుంటున్నారని ఎంతోమంది 17 సంవత్సరాలుగా విద్యాసంస్థల్లో చదువుకొని ఉన్నత స్థాయిలో నిలిచారని తెలిపారు. పేద విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వారి భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలని తెలిపారు. అనంతరం పలువు ఉపాధ్యాయులు దంపతుల గురించి విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏటీపీ తిరుమల్, ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.
Admin
E Nivas News