ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : భగవాన్ శ్రీ సత్యసాయిబాబా చూపిన మార్గం భక్తులకు ఆదర్శనీయమని ఆధ్యాత్మిక గురువు గంగా శంకర్ పేర్కొన్నారు. సత్య సాయి బాబా శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని శనివారం మంథని పట్టణంలోని సత్యసాయి మందిరంలో ఏర్పాటుచేసిన ఆధ్యాత్మిక కార్యక్రమములో ఆయన ప్రసంగించారు. తన సోదరుడు స్వర్గీయ గంగా మహాదేవ్ నెలకొల్పిన ఈ ఆలయంలో అనేక సేవా కార్యక్రమాలను ఏర్పాటు చేస్తుండడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందని తెలిపారు. కలియుగంలో మానవులకు ఆధ్యాత్మిక మార్గం ఒక్కటే ఆదర్శనీయమన్నారు. చివరి రోజున సంగీత విభావరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అష్టదని గంగాధర్, ప్రముఖ కామెంటేటర్, క్రీడా విశ్లేషకులు మహావాది సుధీర్, రామడుగు మారుతి, కొమురవెల్లి విజయకుమార్, మేడగోని రాజమౌళి గౌడ్ తోపాటు భక్తులు పాల్గొన్నారు.
Admin
E Nivas News