Friday, 31 July 2026 09:04:49 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఎన్నికల నియమాలను పాటించాలి...

డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ

Date : 10 February 2026 08:22 AM Views : 156

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆదిలాబాద్ పట్టణంలోని మున్సిపల్ ఎన్నికల సందర్భంగా పట్టణంలో జరిగే ప్రతి ఒక్క వార్డులో పోలీసు లు సూచించిన నియమాలను పాటించాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. సోమవారం డిస్ట్రిబ్యూషన్ సెంటర్ స్థానిక టిటిడిసి నందు జరుగుతున్న ఏర్పాట్లను సిబ్బందికి బందోబస్తు పై జిల్లా ఎస్పీ పరిశీలించి, పలు సూచనలు చేశారు. మున్సిపాలిటీ ఎన్నికల ను ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు ప్రజలు ప్రతి ఒక్కరు సహకరించాలని తెలిపారు. ప్రజలు ప్రతి ఒక్కరూ నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.పోలింగ్ కేంద్రాల వద్ద 163 బిఎన్ఎస్ఎస్ (144 సెక్షన్) అమలులో ఉంటుందని 100 మీటర్ల వద్ద 200 మీటర్ల వద్ద ప్రత్యేక నియమ నిబంధనలు ఉంటాయని వాటిని పాటించాలని, ప్రజల అనవసరంగా గుమిగూడి ఉండరాదని తెలిపారు. పోలింగ్ కేంద్రాలలోనికి సెల్ఫోన్లు, వాటర్ బాటిల్ లు, ఇంకు బాటిల్లు, ఆయుధాలు, పెన్నులు, అగ్నికి సంబంధించిన వాటికి అనుమతులు ఉండవని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్ పద్ధతిని పాటించి పోలీసులకు సహకరించాలన్నారు. పోలింగ్ రోజు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ కేంద్రాలలోనికి అనుమతి ఇస్తారని తెలిపారు. తమ వెంట ఓటర్ ఐడి కార్డులను, గుర్తింపు కార్డులను తెచ్చుకోవా లన్నారు. వాట్సాప్ నందు సోషల్ మీడియా నందు ఇతరులకు రెచ్చగొట్టేలా కించపరిచేలా పోస్టులు పెట్టిన వారిపై పోలీసు నిఘా ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.పట్టణంలో సోమవారంసాయంత్రం 5 గంటల నుండి సైలెన్స్ పీరియడ్ ప్రారంభమవుతుం దని, ప్రచారాలు నిషేధం చేయబడతాయన్నారు. బయట వ్యక్తులు పట్టణంలో ఉండరాదు. ఎలాంటి సమాచారం అయినా డయల్ 100 ద్వారా పోలీసులకు తెలియజేయాలని, గొడవలకు, అల్లర్లకు పాల్పడ కూడదన్నారు. అనుమతులు లేనిదే ర్యాలీలు నిర్వహించ రాదని, ర్యాలీలలో టపాకాయలు పేల్చ రాదన్నారు. సున్నితమైన ప్రాంతాలలో ఫ్లాగ్ మార్చ్ లు నిర్వహిస్తూ ప్రజలలో పోలీసుల పట్ల ధైర్యం నమ్మకం పెంపొందించేందుకు కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండాప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికలు పూర్తి చేయడానికి జిల్లా పోలీస్ యంత్రాంగం కఠినమైన చర్యలతో విధులను నిర్వర్తిస్తుందని తెలిపారు. ఎలాంటి సమాచారం అయినా డయల్ 100 ద్వారా పోలీసు సహాయాన్ని సంప్రదించవచ్చు నని అదేవిధంగా డబ్బు, మద్యం, బహుమతులు లాంటివి పంచే క్రమంలో పోలీసులకు సమాచారం అందించాలన్నారు.పోలీసులు వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ డిఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, శిక్షణ ఐపిఎస్ రాహుల్ కాంత్, మావల సీఐ కర్రె స్వామి, నూతన మున్సిపల్ కమిషనర్ రాజు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :