ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : క్రమశిక్షణతో అంకితభావంతో పార్టీ పటిష్టతకు పాటుపడుతూ పదవులకు వన్నె తెచ్చేలా నాయకుల పనితనం ఉండాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు అన్నారు. మంగళవారం మంత్రి సొంత గ్రామమైన ధన్వాడ తన గృహంలో ఇటీవల నూతనంగా జిల్లా కాంగ్రెస్ కమిటీకి ఎన్నికైన అధికార ప్రతినిధి పంతకాని సమ్మయ్య ప్రధాన కార్యదర్శి కుంభం స్వప్న రెడ్డి,కార్య దర్శి అంగజాల అశోక్ లు మంత్రి శ్రీధర్ బాబును కలిసి శాలువాతో సత్కరించారు. జిల్లా కమిటీలో అవకాశం కల్పించినందుకు మంత్రి శ్రీధర్ బాబు.కు వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ రాబోవు రోజుల్లో ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజాపాలన ప్రభుత్వం తిరిగి మరలావ చ్చేలా ప్రజాప్ర తినిధులు పార్టీ పదవులు ఉన్నవారు. ప్రయత్నం చేయాలన్నారు. ఇటీవల ఎంపికైన జిల్లా కమిటీ సభ్యులకు మంత్రి శ్రీధర్ బాబు శుభాకాంక్ష లు తెలిపారు.
Admin
E Nivas News