ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని సర్వే నంబర్ 314 లో గత నెల 31 న జరిగిన కూల్చివేత పై కుర్ర పోచమ్మ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. భాదితురాలి రిట్ పిటిషన్ పై నేడు విచారణ జరిపి అట్టి స్థలంపై "DUE TO PROCESS OF LAW " ప్రకారం మాత్రమే ముందుకు వెళ్లాలని ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ, కౌంటర్ దాఖలుకు న్యాయస్థానం కేసును నాలుగు వారాలకు వాయిదా వేసింది. పిటిషన్ ను మంథని కి చెందిన హైకోర్టు న్యాయవాది ఇనుముల సత్యనారాయణ దాఖలు చేయగా, సీనియర్ న్యాయవాది కొంగల మోహన్ గౌడ్ తమ వాదనలు వినిపించారు.
Admin
E Nivas News