ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : జిల్లాలోని కాటారం మండలం ప్ర తాపగిరి గ్రామ పంచాయతీలో సోమవారం నర్సరీ పనులు ప్రారంభించారు. అనంతరం ఉమ్మడి రాష్ట్ర స్వర్గీయ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపదరావు 89వ జన్మదిన వేడుకలు పురస్కరించుకొని స్థానిక సర్పంచ్ వూర వెంకటేశ్వరరావు గ్రామ పంచాయతీ కార్యాలయంలో జన్మదిన వేడుకల కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన అనంతరం స్వీటు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటేశ్వర్రావు మాట్లాడుతూ అజాత శత్రువు అయిన స్వర్గీయ శ్రీపాదరావు చేసిన సేవలు పలు అభివృద్ధి పథకాలు కొంత మేర ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచి బియ్యన రాజయ్య. గ్రామస్తులు జక్కుల ఐలయ్య. జక్కుల రాజయ్య. రాగం లక్ష్మయ్య. గుంటి కిష్టయ్యతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News