Thursday, 30 July 2026 07:19:56 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

మాజీ మంత్రి గంగుల కమలాకర్ హౌస్ అరెస్ట్..

Date : 09 May 2026 04:19 PM Views : 166

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కరీంనగర్ జిల్లా మాజీ మంత్రి గంగుల కమలాకర్ ను పోలీసులు శనివారం గృహ నిర్బంధం చేశారు. దీంతో జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. బిజెపి శ్రేణుల దాడికి నిరసనగా బిఆర్ఎస్ పార్టీ నేడు కరీంనగర్ జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది. కరీంనగర్ జిల్లా బంద్ కు పిలుపు ఇవ్వడంతో ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. తాజాగా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద పాడి కౌశిక్ రెడ్డి, వాహనంపై దాడి జరిగిన నేపథ్యంలో టిఆర్ఎస్ శ్రేణులు శనివారం బంద్ కు పిలుపునిచ్చాయి. వాణిజ్య వ్యాపార సంస్థలు విద్యాసంస్థ లు స్వచ్ఛందంగా బంధు చేయాలని టిఆర్ఎస్ శ్రేణులు ఒకరోజు ముందు నుండి పిలుపుని చ్చాయి. దీనికి వ్యతిరేకంగా బిజెపి నాయకులు బంద్ ను విఫలం చేయాలని, వ్యాపార సంస్థలకు మీకు అండగా మేముంటాం మీరు సజావుగా వ్యాపారం చేసుకొని దుకాణాలు తెరవాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నగర వ్యాప్తంగా పోలీసులు భారీగా మోహరించి నాయకులను ముందస్తుగానే అరెస్టు చేశారు. నగరంలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగ కుండా పోలీసులు భారీగా మోహరించి కార్యకర్తలను నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. ఈ సందర్భంగా ఏలాంటివ అవాంచనీయ సంఘటన జరుగకుండా పోలీస్ బలగాలు భారీగ చేరుకున్నాయి.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :