Friday, 31 July 2026 04:34:55 PM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

ఇంటింటికి సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం

రాష్ట్ర యువజన కాంగ్రెస్ కొండా యువసేన నాయకులుసిలివేరు అనిల్

Date : 01 November 2025 11:21 AM Views : 276

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఆసిఫాబాద్ : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లోనే అనేకమైన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులు అభివృద్ధి చూస్తూ ఓర్చుకోలేక కడుపు మంటతో ఎక్కడ వారి మనగడ పోతుందోనని భయంతో రోడ్లపైకి వచ్చి ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులపై స్థానిక ఎమ్మెల్యే పై మండల నాయకులపై, అసత్యపు ప్రచారాలకు పాల్పడుతున్నారని రాష్ట్ర యువజన కాంగ్రెస్ కొండా యువసేన నాయకులుసిలివేరు అనిల్ అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఎన్నో మార్లు బస్సు చార్జీల పెంపు, కరెంటు చార్జీల పెంపు, గ్యాస్ ధరల పెంపుతో పేద ప్రజల మీద అధిక భారం మోపిందని, మీరు ఎన్ని అసత్య ప్రచారాలు చేసిన ప్రజలు మిమ్మల్ని నమ్మే పరిస్థితిలో లేరన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ని ప్రజలు గమనిస్తున్నారని సన్న బియ్యం, ఇందిరమ్మ ఇల్లు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్లు ఉచిత కరెంటు, కొత్త రేషన్ కార్డులు, 10 లక్షల ఆరోగ్యశ్రీ లాంటి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. నిరుపేద కుటుంబాలకు ఇంతకంటే ఎక్కువ సహాయం ఏ ప్రభుత్వం చేస్తుందో మీ నాయకులు చెప్పగలరా అని ప్రశ్నించారు. 20 నెలల్లో ప్రతి ఇంటికి ఏదో ఒక విధంగా ప్రభుత్వ పథకాలు అందలేదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిరూపించగలరా. 2014 నుండి 2023 వరకు పదేళ్లలో టిఆర్ఎస్ పాలనలో మేనిఫెస్టోలో పెట్టి ఇస్తానన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎందుకివ్వలేదన్నారు. దళిత బంధు, నిరుద్యోగ భృతి, దళితులకు 3 ఎకరాల భూమి, పేదలకు కేజీ టు పీజీ ఉచిత విద్యలాంటి హామీలను నెరవేర్చడంలో బిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రజలపై 8 లక్షల కోట్ల భారం మోపి మిగులు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చిన కెసిఆర్, బీఆర్ఎస్ నాయకులకు కాంగ్రెస్ గురించి మాట్లడటం గమనార్హమన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :