ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : సమతా సైనిక్ దళ్, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో భీమా కోరేగావ్ శౌర్య దివస్ ను హైదరాబాద్ లో ఘనంగా నిర్వహించారు. సెక్రెటెట్ ఏరియా అంబేద్కర్ స్ఫూర్తి భవన్ నుంచి ట్యాంక్ బండ్ డా.బీఆర్ అంబేద్కర్, భీమా కోరేగావ్ శౌర్య స్తూపం వద్దకు కావత్ ర్యాలీ గా వెళ్ళి దివస్ వేడుకలు చేసుకోవడం జరిగింది. ఈ కావత్ ర్యాలీలో పెద్దపల్లి జిల్లా సమతా సైనిక్ దళ్ ప్రధాన కార్యదర్శి కొఠారి శ్రీనివాస్ , పలువురు నాయకులు పాల్గొని స్థూపానికి పూలు వేసి ఒక్కరికొక్కరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ సందర్భంగా కొఠారి శ్రీనివాస్ మాట్లాడుతూ 1818 జనవరి 1 న భీమా కోరేగావ్ గ్రామంలో అంటరాని తనానికి వ్యతిరేకంగా తమ అస్తిత్వo కోసం పేష్వ రాజుల 28 వేల సైన్యంతో కేవలం 500 మంది మహార్ బెటాలియన్ పోరాడి విజయ సాధించిన దివస్ ను భీమా కోరేగావ్ శౌర్య దివస్ గా జరుపుకోవటం, ఈ కవాత్ లో పాల్గొనడం సంతోషంగా ఉందని అన్నారు. అందరం భీమకొరెగావ్ అమరవీరుల స్పూర్తితో డా.అంబేద్కర్ గారి ఆలోచన ఆశయాలతో నడిచి అణగారిన నిరుపేద వర్గాలకు అండగా వుంటు ప్రతి గడప గడపకు బాబాసాహెబ్ ఐడియాలజీని పంచుతూ రాజ్యాంగంలో వున్న హక్కులను తెలుసుకొని బావి తరాలకు బాటలు వేస్తూ ప్రజలను చైతన్య పరుస్తూ ప్రతి ఒక్కరూ సమసమాజ స్థాపన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు.
Admin
E Nivas News