ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన కిషన్ తాండూర్ లో నీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఫిజిక్స్ అధ్యాపకుడు గా పని చేస్తున్నాడు. కాగా కిషన్ కు మధ్యప్రదేశ్ లోని శ్రీకృష్ణ విశ్వవిద్యాలయం నుండి డాక్టరేట్ లభించింది. ఫిజిక్స్ విభాగంలో లెక్చరర్ గా సేవలు అందజేస్తున్న కిషన్ మధ్యప్రదేశ్ లోని శ్రీకృష్ణవిశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ అరవింద్ కుమార్ పర్యవేక్షణలో “విజిల్ మోడ్ తరంగాల ప్రేరణతో భూమి యొక్క మాగ్నెటోస్పియర్‌లో ఎలక్ట్రాన్ పిచ్ యాంగిల్ స్కాటరింగ్ యొక్క సంక్లిష్టతల అధ్యయనం” అనే అంశంపై చేసిన పి.హెచ్.డి. పరిశోధన విజయవంతంగా పూర్తి చేశాడు. విశ్వవిద్యాలయంలో సిహెచ్.కిషన్ నిపుణుల సమక్షంలో ఫైనల్ వైవా కూడా పూర్తిచేశారు. ఈ మేరకు సిహెచ్ .కిషన్ కి డాక్టరేట్ పట్టా అందజేస్తున్నట్టు శ్రీకృష్ణ విశ్వవిద్యాలయ యాజమాన్యం శనివారం అధికార ప్రకటన ద్వారా తేలిపింది. డాక్టరేట్ పొందిన ఫిజిక్స్ లెక్చరర్ సిహెచ్ . కిషన్ ను గ్రామస్తులు మరియు మిత్రులు అభినందించారు.
Admin
E Nivas News