Friday, 31 July 2026 06:31:28 AM
# రూ.1.35 లక్షల స్కాలర్షిప్ చెక్కులను పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ప్రతిభా పురస్కారాలు # ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ప్రపంచ ట్రాఫికింగ్ వ్యతిరేక దినోత్సవంపై అవగాహన సదస్సు # రెవెన్యూ అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యానికి తావివ్వొద్దు # కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ రాకతో సంబరాలు:-జి.నాగముని(లీగల్ సెల్ రాష్ట్ర కార్యదర్శి) # మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదు... # భారీ వర్షానికి కూలిన ఇంటిని పరిశీలించిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్... # ఆగస్టు నెలలో 3 నెలల సన్నబియ్యం పంపిణీ చేస్తాం... # అనారోగ్యంతో అయ్యప్ప గురు స్వామి మృతి.. # నిండుకుండలా కనిపిస్తున్న తెలంగాణ ప్రాజెక్టులు... # రోడ్లు మరమ్మతులు చేయాలని యువత వర్షంలో తడుస్తూ యువకులు నిరసన... # 2034 వరకు సీఎంగా నేనే ఉంటా... # మృతి చెందిన ఎగ్గెం మరియమ్మ కుటుంబానికి 5000/- ఆర్థిక సహాయం అందించిన వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి రామసుబ్బమ్మ # పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం...

పారిశుద్ధ్య నిర్వహణ ప్రతి ఒక్కరి బాధ్యత..

అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య

Date : 17 May 2026 11:37 PM Views : 76

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పారిశుధ్య నిర్వహణ ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లాలోని లక్షెట్టిపేట మున్సిపల్ పరిధిలోని 5వ వార్డులో పారిశుద్ధ్యం, రోడ్డు విస్తరణ పనుల పురోగతిని అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో ప్రజలకు త్రాగునీరు, పారిశుద్ధ్యం, అభివృద్ధి పనుల నిర్వహణపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత పాటించాలని, తద్వారా ఆరోగ్య ప్రమాణాలు మెరుగుపడతాయని, వ్యాధుల నియంత్రణలో పరిశుభ్రత కీలకపాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం హరహదారి విస్తరణ పనులు చేపట్టడం జరుగుతుందని, అభివృద్ధి పనుల అనంతరం రహదారి ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. ప్రజలతో మాట్లాడి వార్డులో నెలకొన్న సమస్యల వివరాలు తెలుసుకొని అధికారుల సమన్వయంతో త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అనంతరం 6వ వార్డులో కొనసాగుతున్న దాన్యం కొనుగోలు కేంద్రాన్ని లక్షెట్టిపేట మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ అంజలి, వైస్ చైర్ పర్సన్ రాజేశ్వరి లతో కలిసి సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమంలో భాగంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం నాణ్యమైన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుండి కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోలు కేంద్రాలలో త్రాగునీరు, నీడ సౌకర్యాలు కల్పించడంతో పాటు తేమ యంత్రాలు, ప్యాడి క్లీనర్లు, గోనె సంచులు, టార్పాలిన్ కవర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ధాన్యం కొనుగోలు సంబంధించి రైతుల వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని, రిజిస్టర్ల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని నిర్వాహకులకు సూచించారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడవకుండా కేటాయించిన ప్రకారం గోదాములు, రైస్ మిల్లులకు వేగంగా తరలించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :